
హైదరాబాద్, వెలుగు: పోలీస్ శాఖలో సీనియర్ పోలీసులకు సంక్రాంతి బహుమతి లభించింది. 1989,1990 బ్యాచ్‌లకు చెందిన 187 మందికి ఏఎస్సై నుంచి ఎస్సైలుగా ప్రమోషన్ దక్కింది. ఈ మేరకు మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికై,హెడ్ కానిస్టేబుల్, ఏసీపీగా 35 ఏండ్లు పూర్తి చేసుకుని ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా డీజీపీ జితేందర్ పదోన్నతులు కలిగించారని పేర్కొన్నారు.